Monday, July 8, 2019

కార్తీకదీపం’ జూలై 09, ఎపిసోడ్: దీప ఇంటికి కార్తీక్.. చేతులెత్తి వేడుకున్నా కనికరించని దీప

253 ఎపిసోడ్‌లోని హైలెట్స్ చూద్దాం! 





సౌర్య‌-వార‌ణాసి పెన్సిల్స్, పెన్స్ కొనుక్కోవ‌డానికి బ‌య‌టికి వెళ్తారు. కాసేప‌టికి కార్తీక్.. దీప ఇంటికి వ‌స్తాడు. గుమ్మం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఇబ్బందిగా చూస్తూ ఉంటారు. కానీ దీప అత‌డి రాక‌ను గుర్తించ‌కుండా వంట ప‌ని చేసుకుంటూ ఉంటుంది. దాంతో కార్తీక్ వెన‌క్కి వెళ్లిపోయి.. కారు ద‌గ్గ‌ర నిల‌బ‌డి దీప‌కి కాల్ చేస్తాడు. కోపంగా లిప్ట్ చేసి దీప‌.. ''ఏంటీ?'' అని అడుగుతుంది. ''ఒక‌సారి బ‌య‌టికి రా'' అంటాడు కార్తీక్ ఇబ్బంది ప‌డుతూ.. ''నేనా?'' అంటుంది దీప‌ అనుమానంగా.. ''నీకేగా కాల్ చేసింది.. నువ్వే! రా ఒక‌సారి బ‌య‌టికి?'' అంటాడు మ‌ళ్లీ కార్తీక్ కాస్త క‌రుకుగా.. ''ఏ బ‌య‌టికి?'' అంటుంది అర్థం కాక‌. ''నీ కొంప‌..'' అని వ‌చ్చిన త‌న మాట‌ల‌ని ఆపుకుంటూ.. ''మీ ఇంటి బ‌య‌టికి'' అంటాడు కార్తీక్‌. ''నా కొంప‌.. నా ఇంటి దాకా వ‌చ్చి.. లోనికి రావ‌డానికేమైంది?'' అంటుంది దీప వెట‌కారంగా.. ''లోప‌ల ఆ రౌడీ (సౌర్య‌) ఉంటుందిగా అందుకే..'' అంటాడు కార్తీక్ క‌వ‌ర్ చేసుకుంటూ... ''సౌర్య లేదు బ‌య‌టికి వెళ్లింది'' అంటుంది దీప‌. ''ప్లీజ్ రా.. మాట్లాడి వెళ్లిపోతాను'' అని కార్తీక్ బ‌తిమ‌లాడ‌తాడు. ''రాను'' అంటుంది దీప‌. కోపం వ‌చ్చిన కార్తీక్‌..త‌న చేతిలోని సెల్ విసిరి కొట్ట‌బోయి.. ఆగి.. ''చూడూ.. నిన్ను నిందించ‌డానికో, నిల‌దియ్య‌డానికో రాలేదు.. రెండే నిమిషాలు వ‌చ్చి వెళ్లు...'' అంటూ ఫోన్ క‌ట్ చేస్తాడు. దాంతో దీప బ‌య‌టికి వ‌స్తుంది. అయినా ఏం మాట్లాడుకుండా మౌనంగా ఉన్న కార్తీక్‌ని చూసి.. పొడి పొడిగా ద‌గ్గి.. ''నేనొచ్చాను'' అంటుంది దీప‌. ''నేనూ దిగొచ్చాను'' అంటాడు కార్తీక్‌. ''అయితే సౌర్య‌ని, న‌న్ను ఇంటికి తీసుకుని వెళ్తారా?'' అంటూ న‌సుగుతుంది దీప‌. ''ఏంటీ'' అని కార్తీక్ అడ‌గ‌డంతో ఏం కాదు చెప్పండి'' అంటుంది దీప‌. ''హిమ నా కూతురు..'' అంటాడు కార్తీక్‌. ''తొమ్మిది నెల‌లు మోసి క‌న్నారా?'' అంటుంది దీప వెట‌కారంగా.. ''అది అనాథని చెప్పి.. మా అమ్మ నా చేతుల్లో పెట్టింది..'' అంటాడు కార్తీక్. ''అవును.. తెలుసు..'' అంటుంది దీప పొగ‌రుగా చూస్తూ.. ''హిమ నా ప్రాణం..'' అంటాడు కార్తీక్. ''అదీ తెలుసు... అయితే? అంటుంది దీప అంతే పొగ‌రుగా. వెంట‌నే చేతులు జోడించి ద‌న్నం పెడుతూ.. ''హిమ జోలికి నువ్వు రావ‌ద్దు.. నా హిమ మీద నువ్వు ప్రేమ‌ని చూపించొద్దు. దాన్ని నేనెంత ప్రేమ‌గా చూసుకుంటున్నానో అదీ అంతే ప్రేమ నా మీద చూపించాలి. అస‌లు ఎందుకు దాన్ని ఇంత‌కు ముందు కంటే ఎక్కువ ప్రేమ‌గా చేసుకుంటున్నావ్‌.? గుడిలో బ‌డిలో ఉందుకు క‌లుస్తున్నావ్‌? నేను మ‌నిషిలా ఉన్నానంటే.. కేవ‌లం హిమ వ‌చ్చిన త‌ర్వాతే. అది న‌న్ను మ‌రిచిపోతే... మ‌ళ్లీ నేను జీవ‌చ్చ‌వంలా బ‌త‌కాలి. ఆ శిక్ష నాకొద్దు. నీకు ఏ సాయం కావాల‌న్నీ నేను చేస్తాను. ద‌య‌చేసి హిమ‌ని వ‌దిలెయ్యి'' అంటాడు కార్తీక్ ఏడుస్తూ.. ఆ మాట‌ల‌కు క‌రిగిన దీప‌.. మ‌న‌సులో.. 'హిమ మ‌న బిడ్డేన‌ని డాక్ట‌ర్‌బాబుకి చెప్పెయ్యాలి..' అనుకుంటూ ఉండ‌గా.. సౌర్య‌-వార‌ణాసిలు తిరిగి వ‌చ్చేస్తారు. ''డాక్ట‌ర్ బాబూ... హిమ‌ని తీసుకొచ్చారా?'' అంటూ కారులో హిమ‌కోసం చూసి.. ''లేదా.. అయితే నా కోస‌మే వ‌చ్చారా..? అమ్మా! డాక్ట‌ర్ బాబుని బ‌య‌టే నిల‌బెట్టి మాట్లాడ‌తావేంటి? ర‌ండి డాక్ట‌ర్ బాబూ..'' అంటూ లోనికి తీసుకొచ్చి కూర్చోబెటుతుంది సౌర్య‌. ''స్కూల్ ఫీజ్ క‌ట్ట‌మ‌ని నువ్వే ఫోన్ చేశావా?'' అంటాడు వార‌ణాసి.. ఆ మాట‌కి దీప కోపంగా చూస్తుంది వార‌ణాసివైపు. ''ఫీజ్ క‌డితేనే టెక్ట్స్ బుక్స్ ఇస్తార‌ట డాక్ట‌ర్ బాబూ'' అంటాడు వార‌ణాసి మ‌ళ్లీ మాట్లాడుతూ.. ఆ మాట‌లు విన్న కార్తీక్‌.. ''ఓ.. స్కూల్ ఫీజ్ క‌ట్టాలి క‌దూ'' అనుకుంటూ.. ''నువ్వు వెళ్లి కారులో చెక్ బుక్ ఉంటుంది తీసుకునిరా'' అంటూ వార‌ణాసిని పంపిస్తాడు. వార‌ణాసి వెళ్ల‌గానే సౌర్య మాట్లాడుతూ.. ''గుడిలో హిమా, నేను బాగా ఆడుకున్నాం డాక్ట‌ర్ బాబు.. మీ గోత్రం మా గోత్రం ఒక‌టేనంట తెలుసా?'' అంటుంది న‌వ్వుతూ.. కార్తీక్ గుర్రుగా దీప‌వైపు చూస్తాడు ఆ మాట‌ల‌కి. ఇంత‌లో వార‌ణాసి చెక్ బుక్ తీసుకుని రావ‌డంతో దానిపైన సంత‌కం పెట్టి.. అమౌంట్ వేసి.. ''రేపు స్కూల్లో ఇచ్చెయ్య్‌.. బాగా చ‌దువుకో.. ఏదైనా అవ‌స‌రం అయితే ఫోన్ చెయ్యి..'' అంటాడు కార్తీక్ సౌర్య‌తో.. సౌర్య వెంట‌నే కార్తీక్ కాళ్ల మీద ప‌డుతుంది. 'హేయ్ రౌడీ' అంటూ పైకి లేపి.. ''వెళ్తాను రౌడీ..'' అంటూ వెళ్లిపోతాడు. మౌనిత బెడ్ రూమ్‌లో ఉంటూ ప‌ర్ఫ్యూమ్ స్మెల్‌ని బ‌ట్టి.. 'కార్తీక్ వ‌చ్చాడు క‌దా..' అనుకుంటూ ఓ సంబంర‌ప‌డిపోతుంది. శ్రీల‌త‌ని పిలిచి అడిగితే.. ''రాలేదే'' అంటుంది. ''క‌చ్చితంగా కార్తీక్ వ‌చ్చి వెళ్లాడు.. త‌ను వాడే ప‌ర్ఫ్యూమ్ స్మెల్ నాకు తెలుస్తుంది'' అంటూ ఒక్క‌టి పీకుతుంది శ్రీల‌త‌ని. ''అది నేనే కొట్టుకున్నాను.. మా ఆయ‌న కూడా అదే ప‌ర్ఫ్యూమ్ వాడ‌తాడు.. త‌నతో మ‌ళ్లీ క‌లిసి బ‌త‌కాల‌ని కోరుకుంటున్నాను కాబ‌ట్టి అత‌డి ఇష్టాలే నా ఇష్టాలు'' అంటుంది శ్రీల‌త‌ కాస్త క‌ఠినంగా.. వెంట‌నే శ్రీల‌త‌ చేతిలోని ప‌ర్ఫ్యూమ్ బాటిల్ లాక్కుని, విసిరి కొడుతుంది మౌనిత‌. ''నువ్వు వెళ్లి ఆ డ్రెస్ మార్చి.. బాత్ చేసి వేరే డ్రెస్ వేసుకో.. ఇంకెప్పుడూ ఆ ప‌ర్ఫ్యూమ్ వాడ‌కు'' అని వార్నింగ్ ఇస్తుంది శ్రీల‌త‌కి మౌనిత‌. దీప ఒంట‌రిగా కూర్చుని కార్తీక్ మాట‌ల‌ను త‌లుచుకుంటూ ఆలోచ‌న‌లో ప‌డుతుంది. 'న‌న్ను, నా క‌ష్టాన్ని ప‌ట్టించుకోని మ‌నిషి కోసం నేనెందుకు ఆలోచించాలి? నేనెందుకు నా బిడ్డ‌ని వ‌దులుకోవాలి? హిమ‌ని వ‌దులుకునే ప్ర‌స‌క్తే లేదు..' అని నిర్ణ‌యించుకుంటుంది మ‌న‌సులో.. కార్తీక్ బార్‌కి వెళ్తాడు. దీప‌తో త‌ను మాట్లాడిన మాట‌ల‌ను తలుచుకుంటూ.. దీప చూపును గుర్తుతెచ్చుకుంటూ.. 'ఆ చూపుకి అర్థం ఏంటీ.. నాకేం కానీ దాని కూతురికి అంత చేస్తుంటే.. స‌రే డాక్ట‌ర్ బాబు అని ఒక్క‌మాట కూడా అన‌లేదు' అనుకుంటాడు మ‌న‌సులో.. స‌రిగ్గా మందు తాగుతామ‌నుకునే స‌రికి హిమ గుర్తుకొస్తుంది కార్తీక్‌కి. ''నో నేను తాగ‌ను.. ఆ దీప ఈ కార‌ణంగా కూడా హిమ‌ని నాకు దూరం చెయ్యొచ్చు. నా హిమ‌ని నేను బాధ పెట్ట‌ను' అనుకుంటూ ఆర్డ‌ర్ క్యాన్సిల్ చేసి ఇంటికి బ‌య‌లుదేర‌తాడు కార్తీక్‌. సౌంద‌ర్య కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ''నిజంగానే ఇంటికి రాడా? అస‌లు దాన్ని(దీప‌ని) రావ‌ద్దు అన‌లేను.. వీడిని రామ్మ‌ని అడ‌గ‌లేను..'' అంటూ భ‌ర్త ఆనంద‌రావుతో త‌న బాధ చెప్పుకుంటూ ఉంటుంది. ఇంత‌లో పైనుంచి హిమా-కార్తీక్‌ల న‌వ్వులు వినిపిస్తాయి. ''వాడి మాట‌ల్లానే ఉన్నాయ్.. ఎప్పుడొచ్చాడండీ?'' అంటూ షాక్ అవుతుంది సౌంద‌ర్య‌. ''ప‌ద పైకి వెళ్లి చూద్దాం'' అంటాడు ఆనంద‌రావు. ఇద్ద‌రూ క‌లిసి పైకి వెళ్లేస‌రికి హిమా-కార్తీక్‌లు ఆడుకుంటూ న‌వ్వుకుంటూ ఉంటారు




క‌మింగ్ అప్‌ ఇంట్రస్టింగ్.. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందంటే.. కార్తీక్ దీప ఇంట్లో త‌న ఫోన్ మ‌ర్చిపోతాడు. ఆ ఫోన్‌ని దీప తీసి చూడ‌గా హిమ ఫొటో క‌నిపిస్తుంది. వెంట‌నే ముద్దులు పెట్టుకుని ప్రేమ‌గా ఆ ఫోన్‌ని గుండెల‌కు హ‌త్తుకుంటుంది దీప‌. 'అయినా వేరే వాళ్ల వ‌స్తువు మ‌న‌కెందుకు.. ఇచ్చేస్తా' అని ప‌క్క‌న పెట్టి.. మ‌ళ్లీ తీసుకుని.. 'అవునూ.. ఆ మ‌నిషి నా నంబ‌ర్ ఏం సేవ్ చేసుకున్నాడో చూద్దాం..' అంటూ త‌న ఫోన్ నుంచి కార్తీక్ ఫోన్‌కి రింగ్ ఇచ్చుకుంటుంది దీప‌. ఆ పేరు చూసి షాక్ అవుతూ ఉంటుంది. వెంట‌నే పైకి లేచి ఫోన్‌ని విసిరి కొట్ట‌బోతూ ఆగుతుంది. అస‌లు కార్తీక్ దీప పేరుని త‌న ఫోన్‌లో ఏమ‌ని సేవ్ చేసుకున్నాడో రేపు చూడాల్సిందే. కార్తీక‌దీపం కొన‌సాగుతోంది.

No comments:

Post a Comment

Virat Kohli posts 'squad' picture, fans ask where's Rohit Sharma?

NEW DELHI: The Indian cricket team has arrived in the US for the upcoming three-match T20I series against the West Indies which starts from...