Thursday, July 11, 2019

ఇక.. మిడిలార్డర్‌ ప్రక్షాళనే!

లండన్‌: వరల్డ్‌కప్‌ వైఫల్యం నేపథ్యంలో టీమిండియా మిడిలార్డర్‌ను ప్రక్షాళన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా.. వన్డే మెగాటోర్నీలో అట్టర్‌ ఫ్లాపయిన కేదార్‌ జాదవ్‌, దినేష్‌ కార్తీక్‌కు ఇక టీమ్‌లో చోటు కష్టమే. ధోనీ కెప్టెన్సీ చేపట్టినప్పటి నుంచి వన్డే వరల్డ్‌కప్‌ కోసం టీమిండియా రెండే ళ్లు, టీ20 ప్రపంచకప్‌ కోసం 18 నెలలు ముందుగానే సిద్ధమవుతూ వస్తోంది. ప్రస్తుత వరల్డ్‌క్‌పలో భారత మిడిలార్డర్‌ వైఫల్యం టీమిండియా అతిపెద్ద బలహీనతగా కనిపించింది. కేదార్‌, దినే్‌ష ఒత్తిడిని ఏమాత్రం అధిగమించలేకపోయారు. నాకౌట్‌ మ్యాచ్‌లో రోహిత్‌, కోహ్లీ, రాహుల్‌ విఫలం కావడం నిజంగా దురదృష్టమే. 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌ చేతిలో ఓటమి తర్వాత ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు యజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లే మ్యాచ్‌ విన్నర్లనే ఫిలాసఫీతోనే కోచ్‌ రవిశాస్త్రి, కోహ్లీ వ్యవహరించారు. 






వారిద్దరూ కేంద్రంగానే జట్టును తయారు చేశారు. ద్వైపాక్షిక సిరీ్‌సలో ఈ సూత్రం అద్భుత ఫలితాలను ఇచ్చినా.. వరల్డ్‌క్‌పకు వచ్చేసరికి స్పిన్‌ ద్వయం ఆశించిన మేరకు రాణించలేకపోయింది. మరోవైపు ప్లాన్‌-బి లేకపోవడం టీమిండియాను తీవ్రంగా దెబ్బతీసింది. టాపార్డర్‌లో రోహిత్‌, కోహ్లీ శతకాలతో అదరగొడుతున్న వరకూ ఎటువంటి ఇబ్బందీ ఎదురుకావడంలేదు. ఏడో నెంబర్‌లో హార్దిక్‌ పాండ్యా ధనాధన్‌ ఆటవల్ల ధోనీ సామర్థ్యం తగ్గినా ఎలాగోలా నడిచి పోయింది. ఇక మనీష్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌కు తగిన అవకాశాలు కల్పించకుండానే వరల్డ్‌కప్‌ జట్టు ప్రణాళిక నుంచి తప్పించారు. భవిష్యత్‌ ఆశాకిరణంగా భావిస్తున్న శుభ్‌మన్‌ గిల్‌ను న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లోనే అవకాశం కల్పించి ఆ తర్వాత పక్కనబెట్టారు. కానీ, కార్తీక్‌, జాదవ్‌ లాంటి వారికి వరల్డ్‌కప్‌ ఓ గుణపాఠం. ఈ ఏడాది ఇంగ్లండ్‌పై పిచ్‌లపై దినేష్‌ కార్తీక్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. మరోవైపు భారీ షాట్‌లు కొట్టలేని జాదవ్‌పై భారత్‌ ఎంతో నమ్మకం ఉంచడం పెద్ద లోపం. ధోనీ రాణించాలంటే ఆవలి ఎండ్‌లో జడేజా, పాండ్యా లాంటి వారు అవసరం. ధాటిగా ఆడగలిగిన వారి స్థానాల్లో కేదార్‌, కార్తీక్‌ను ఎంపిక చేసి టీమిండియా మేనేజ్‌మెంట్‌ పెద్ద తప్పే చేసింది. కెప్టెన్‌ అవసరాలకు తగిన జట్టును సెలెక్టర్లు ఎంపిక చేయగలరనే భరోసా కూడా ఇవ్వలేక పోయారు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో జట్టులో భారీ మార్పులు చేయనున్నట్టు కోహ్లీ ముందుగానే సంకేతాలిచ్చాడు. వన్డే, టీ20 వరల్డ్‌క్‌పలను దృష్టిలో ఉంచుకొని 20 మంది సభ్యుల కోర్‌ టీమ్‌ కోసం అన్వేషణ జరగడం ఖాయమే..!

No comments:

Post a Comment

Virat Kohli posts 'squad' picture, fans ask where's Rohit Sharma?

NEW DELHI: The Indian cricket team has arrived in the US for the upcoming three-match T20I series against the West Indies which starts from...