253 ఎపిసోడ్‌లోని హైలెట్స్ చూద్దాం..
సౌందర్య కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ''నిజంగానే ఇంటికి రాడా?'' అంటూ భర్త ఆనందరావుతో తన బాధ చెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో పైనుంచి హిమా-కార్తీక్‌ల నవ్వులు వినిపిస్తాయి. ''వాడి మాటల్లానే ఉన్నాయ్.. ఎప్పుడొచ్చాడండీ?'' అంటూ షాక్ అవుతుంది సౌందర్య. ''పద పైకి వెళ్లి చూద్దాం'' అంటాడు ఆనందరావు. ఇద్దరూ కలిసి పైకి వెళ్లేసరికి హిమా-కార్తీక్‌లు ఆడుకుంటూ, నవ్వుకుంటూ ఉంటారు. ''ఎప్పుడు వచ్చావ్ సుపుత్రా'' అంటుంది సౌందర్య. ''ఆకాశం నుంచి విచిత్రమైన చుక్క కింద పడినప్పుడు'' అంటాడు కార్తీక్ వెటకారంగా.. ''నీ కోసం ఇంత కంగారు పడుతూ ఉంటే మాకు కనిపించకుండా ఎలా పైకి వచ్చావ్'' అంటుంది సౌందర్య.
''మీరు.. కొత్తిమీర, కరివేపాకు అంటూ పాకశాస్త్రం (దీప) గురించి లీనమై మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చానులే మమ్మీ'' అంటాడు మళ్లీ వెటకారంగా.. ''అంటే ఏంటి డాడీ?'' అంటుంది హిమా నవ్వుతూ.. ''నాన్నమ్మకి అర్థమైందిలేరా..'' అంటాడు కార్తీక్. అలా సౌందర్య-కార్తీక్‌ల మధ్య ఎప్పట్లానే మాటల యుద్ధం జరుగుతుంది. కోపంతో వెళ్లిపోయిన సౌందర్యని బతిమలాడి తినడానికి తీసుకొస్తాడు కార్తీక్. తినేప్పుడు హిమా... కార్తీక్,సౌందర్య, ఆనందరావులకి వడ్డిస్తుంది. ''హిమా.. ఇక నుంచి నాన్నమ్మాతాతయ్యాలు తినేలా చేసే బాధ్యత నీదే.. నేనున్న లేకపోయినా నువ్వు వాళ్ల కడుపు నిండా తినేలా చెయ్యాలి సరేనా'' అంటాడు కార్తీక్. హిమ సరే అంటుంది. (ఈ టెన్షన్‌లో టైమ్‌కి తినకుండా ఉంటున్న తల్లిదండ్రులని.. చిన్నపిల్ల బాధపడుతుందనైనా తింటారనే నమ్మకంతో తెలివిగా అలా ఇరికించాడు కార్తీక్.)
మౌనిత టెన్షన్ అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తుంది. 'ఆ దీప ఫోన్ చెయ్యట్లేదు.. ఈ కార్తీక్ ఫోన్ లిప్ట్ చెయ్యట్లేదు.. అబ్బా పిచ్చెక్కుతోంది..' అనుకుంటూ.. ''ఓసేయ్ శ్రీలతా అయ్యిందా వండటం? ఆకలేస్తుందే..'' అంటూ హడావడి చేస్తుంది. హడలుహడలుగా వచ్చిన శ్రీలత.. వంట అయిపోయిందని చెబుతుంది. ''కార్తీక్ ఫోన్ చెయ్యట్లేదే..'' అంటుంది మౌనిత బాధగా.. ''దానికి నేనేం చెయ్యనే?'' అంటూనే.. ''దీప-కార్తీక్ ఇద్దరూ కలిసిపోయి ఉంటారు'' అంటుంది శ్రీలత కావాలనే.. వెంటనే కొట్టడానికి సిద్ధపడ్డ మౌనిత కొట్టకుండా ఆగి.. ''ఏమాటకామాట అనుకోవాలే.. ఆ దీప నిజంగానే మహా పతీవ్రత.. చాలా గొప్ప స్త్రీ'' అంటూ పొగుడుతుంది. ఆ పొగడ్తలు విని శ్రీలత షాక్ అవుతుంది. ''నువ్వు దీపని పొగుడుతున్నావా? అంటే విహారీ అనే వాడు నిజంగా ఉన్నాడా లేక.. అది కూడా నీ కల్పితమేనా?'' అని అడుగుతుంది శ్రీలత. నీకు సగం తెలుసు.. సగం తెలియదు.. విహారీ అనేవాడు ఉన్నాడు.. నిజంగానే దీప వాడ్ని అన్నయ్య అని భావించింది.. కానీ నేను దాన్ని వక్రీకరించి కార్తీక్‌కి అనుమానం పుట్టేలా చేశాను'' అంటూ జరిగినదంతా శ్రీలతకి చెబుతుంది మౌనిత.
కార్తీక్ దీప ఇంట్లో తన ఫోన్ మర్చిపోతాడు. ఆ ఫోన్‌ని దీప తీసి చూడగా హిమ ఫొటో కనిపిస్తుంది. వెంటనే ముద్దులు పెట్టుకుని ప్రేమగా ఆ ఫోన్‌ని గుండెలకు హత్తుకుంటుంది దీప. ''ఆ మనిషి ఫోన్ నాకెందుకు'' అని పక్కన పెట్టి.. మళ్లీ తీసుకుని.. ''అవునూ.. ఆ మనిషి నా నంబర్ ఏం సేవ్ చేసుకున్నాడో చూద్దాం..'' అంటూ తన ఫోన్ నుంచి కార్తీక్ ఫోన్‌కి రింగ్ ఇచ్చుకుంటుంది దీప. ఆ పేరు చూసి షాక్ అవుతుంది. కోపంతో ఊగిపోతుంది. ఇంతకీ ఆ పేరు ఏంటంటే 'మహానటి'. కార్తీక్ తన ఫోన్‌లో దీప పేరుని 'మహానటి' అని సేవ్ చేసుకున్నాడు. దాంతో 'నన్ను మహా నటి అంటాడా..' అంటూ ఆ ఫోన్ నేలకేసి కొట్టబోతాడు. ఇంతలో ఫోన్ రింగ్గవ్వడం ఆగిపోయి.. హిమా ఫొటో కనిపిస్తుంది. దాంతో ఫోన్ పగలకొట్టకుండా పక్కన పెడుతుంది దీప. ఇంతలో పక్కింట్లో గొడవ జరుగుతూ ఉంటుంది. అద్దెకి ఉంటున్న ఒక అబ్బాయి సామాన్లు అన్నీ.. బయటికి తోసేస్తుంది ఆ ఇంటి ఓనర్. అక్కడ ఆ అబ్బాయి, పక్కనే మరో అమ్మాయి ఏడుస్తూ ఉంటారు.
అక్కడికి వెళ్లిన దీప.. ''ఏం జరిగింది'' అని అడుగుతుంది. ''వీడు రూమ్‌కి దాన్నెవ్వరినో తెచ్చుకుని పెట్టుకున్నాడు. అడిగితే చెల్లులు అంటున్నాడు. చెల్లెలైతే.. ఆ ఇకఇకలు పకపకలు ఏంటీ..? వాళ్లు ముద్దు పెట్టుకోవడం నేను చూశాను'' అంటుంది ఆ ఇంటి ఓనర్. ''దీపక్కా నేను ఎలాంటి వాడినో ఇన్ని రోజులుగా చూస్తునే ఉన్నారుగా మీరైనా చెప్పండి.. ఈ అమ్మాయి నా సొంత చెల్లెలు. రేపు ఎగ్జామ్ ఉంటే ఈ రోజు వచ్చింది..'' అంటాడు ఏడుస్తూ ఆ అబ్బాయి. ''అవునండీ.. మేము సొంత అన్నా చెల్లెల్లం. మా అన్నయ్య కళ్లలో నలక పడితే నేను తీసాను. అది చూసి ఈమె తప్పుగా అర్థం చేసుకుంది'' అంటుంది ఆ అమ్మాయి. వాళ్ల మాటలు, ఆ ఇంటి ఓనర్ మాటలు తలుచుకుంటూ, విహారీతో తన బంధాన్ని గుర్తు చేసుకుంటూ.. కార్తీక్ అన్న మాటలను-ఇంటి ఓనర్ మాటలను పోల్చుకుంటూ దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదే ఆలోచిస్తూ.. తనని తాను అర్థంలో చూసుకుంటూ ఉండిపోతుంది.
రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగబోతోంది.. కమింగ్ అప్ ఇదే!!
మౌనిత కార్తీక్‌కి కాల్ చేస్తుంది. కార్తీక్ ఫోన్ దీప దగ్గర ఉండటంతో.. 'దీనికి దిమ్మతిరిగే షాక్ ఇస్తా' అని మనసులో అనుకుంటూ... దీప ఫోన్ లిప్ట్ చేసి.. ''దీపాకార్తీక్ స్పీకింగ్'' అంటుంది. ''హ...లో...'' అంటూ వణుకుతుంది కంగారుగా మౌనిత. మళ్లీ తనే మాట్లాడుతూ.. ''కార్తీక్ నీతో ఉన్నాడా?'' అంటుంది అనుమానంగా.. ''అవును..'' అని చెప్పి.. ''డాక్టర్ బాబు.. డాక్టర్ బాబూ..'' అని కావాలనే ఫోన్ పక్కకి పెట్టి పిలుస్తుంది దీప. మౌనిత షాక్ అవుతుంది. మళ్లీ దీప మాట్లాడుతూ.. ''ఆయన వాష్‌రూమ్‌లో ఉన్నారు ఫోన్ ఇవ్వనా?'' అని చెబుతుంది. మరిన్ని వివరాలు రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. కార్తీకదీపం కొనసాగుతోంది.

No comments:
Post a Comment