- బౌండరీ రూల్‌పై వ్యంగ్య ట్వీట్
న్యూఢిల్లీ: వరల్డ్‌కప్ ఫైనల్ ఎంత ఉత్కంఠ భరితంగా జరిగిందో.. విజేతను ప్రకటించిన విధానం కూడా అంతే వివాదాస్పదమైంది. మ్యాచ్ టైగా ముగిస్తే.. ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా నిర్ధారించారు. ఇలా టెక్నికల్‌గా మోర్గాన్ సేనను విజేతగా ప్రకటించడంపై ఇప్పటికే అనేకమంది మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనదైన హాస్యచతురతను మేళవించిన ట్వీట్‌తో చురకలు అంటించారు. ‘ఇద్దరి వద్ద సమంగా రెండు వేల రూపాయలు ఉంటే... ఎవరు శ్రీమంతుడు అని నిర్ణయించాల్సి వస్తే? ఐసీసీ ప్రకారం.. ఒక 2 వేల నోటు ఉన్న వాడికంటే నాలుగు రూ. 500 నోట్లు ఉన్న వాడే శ్రీమంతుడు’ అమితాబ్ వ్యంగ్యాత్మక ట్వీట్ చేశారు. వరల్డ్‌కప్ ట్రోఫీ దక్కించుకునేందుకు న్యూజిలాండ్‌కు అర్హత ఉన్నా.. వారు ఉత్త చేతులతో మిగిలారని అమితాబ్ ఇలా సునిశిత విమర్శలు చేశారు.
No comments:
Post a Comment