మాంచస్టర్: ఐసీసీ ప్రపంచకప్‌ను ముద్దాడాలనే టీం ఇండియా కోరిక చెదిరిపోయిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలో టోర్నమెంట్ బరిలోకి దిగిన భారత్.. సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే సెమీస్ ఓటమి తర్వాత టీం ఇండియా మరో చిక్కులో పడింది. భారత జట్టు ఫైనల్స్‌కు చేరుతుందనే ధీమాతో జట్టు యాజమాన్యం ఫైనల్స్ వరకూ ఇండియాకు టికెట్లు బుక్ చేయలేదు. దీంతో ఆటగాళ్లు 14వ తేదీ వరకూ ఇంగ్లండ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఆగస్టు 3వ తేదీ నుంచి భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. కానీ, భారత ఆటగాళ్లు ఇండియాకు చేరుకొని విశ్రాంతి తీసుకోవడం మాత్రం కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ‘‘చాలా మంది ఆటగాళ్లు 14 జూలై వరకూ మాంచస్టర్లోనే ఉండి.. ఆ తర్వాత అక్కడి నుంచి బయలేదేరుతారు. టోర్నీ ముగిసిన తర్వాత టికెట్లు బుకింగ్ అయ్యాయి’’ అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.
No comments:
Post a Comment