లండన్: ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో టీమిండియా ఓటమి భారత క్రీడాభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ మ్యాచ్‌లో ధోనీని న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్తిల్ రనౌట్ చేయడం.. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా చేజారిపోవడం అంతా చకచకా జరిగిపోయాయి. అయితే ఆ రనౌట్‌పై చర్చోపచర్చలు ఇంకా సాగుతున్నాయి. ధోనీ అవుట్ అవ్వకుండా ఉంటే మ్యాచ్ మరోలా ఉండేదని ఒకరంటే.. అసలా బంతిని నోబాల్‌గా ప్రకటించాల్సిందని మరొకరు ఇలా వాదనలు నడుస్తున్నాయి.
ఇదంతా ఇలా ఉంటే ధోనీని అవుట్ చేసిన గుప్తిల్ స్పందన మాత్రం ఆసక్తికరంగా ఉంది. ధోనీని డైరెక్ట్ హిట్‌గా రనౌట్ చేయడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నట్టు గుప్తిల్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకదాన్ని ఐసీసీ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వర్షం కారణంగా మంగళవారం నాటి మ్యాచ్ 46.1 ఓవర్ల దగ్గర నిలిచిపోయిన విషయం తెలిసిందే. మళ్లీ బుధవారం ప్రారంభమైన మ్యాచ్‌లో.. టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.
No comments:
Post a Comment